జైలు జీవితం గడుపుతున్న డేరా బాబాకు కరోనా పాజిటివ్
- రోహతక్ లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా
- ఇటీవల అనారోగ్యానికి గురైన వైనం
- ఆసుపత్రిలో చికిత్స అందించిన అధికారులు
- తాజాగా కరోనా సోకినట్టు వెల్లడి
- గురుగ్రామ్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా ఇప్పుడు కరోనా బారినపడ్డారు. రోహతక్ లోని సునేరియా జైల్లో ఉన్న డేరాబాబా ఇటీవల కొన్నిరోజుల వ్యవధిలోనే రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను తిరిగి జైలుకు తరలించారు. అయితే తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయనను చికిత్స కోసం గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా.... డేరా సచ్చా సౌదా పేరిట ప్రత్యేక మత విధానం ఏర్పాటు చేసి అనేకమందిని భక్తులుగా మార్చుకున్నాడు. ఆయన ఆశ్రమాల్లో చాలా దారుణాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదు కావడంతో, సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో 2017 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.