తెలంగాణలో నియంతృత్వంపై పోరాడడానికి ఈటల దారి చూపారనే ఆశ కలిగింది.. కానీ: కోదండరామ్
- బీజేపీలో ఈటల చేరితే ఆ పార్టీకే లాభం
- ఆయన నిర్ణయంపై నేను మాట్లాడడం సరికాదు
- తొందరపాటు నిర్ణయాలు సరికాదని చెప్పాను
- ఈటల నిర్ణయంతో నియంతృత్వ పాలనపై పోరాడాలనుకున్న వారు నిరాశ చెందారు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ స్పందించారు. ఆయన నిర్ణయం సరికాదని చెప్పారు. బీజేపీలో ఈటల చేరితే ఆ పార్టీకే లాభమని అంతేగానీ, ఆయనకు వచ్చేదేమీ ఉండబోదని తెలిపారు.
అలాగే, ఆయన నిర్ణయంపై తాను మాట్లాడడం కూడా సరికాదని చెప్పారు. బీజేపీలో చేరాలని ఈటల తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతమని అన్నారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం సరికాదని తాను ఈటలకు తెలిపానని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ పాలనను అంతం చేయడానికి ఈటల దారి చూపారనే ఆశ కలిగిందని ఆయన తెలిపారు. బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణలోని నియంతృత్వ పాలనపై పోరాడాలనుకున్న వారు నిరాశ చెందారని చెప్పారు.