2022 నాటికి ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్లు వెయ్యాలి: బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​

  • జీ7 ధనిక దేశాలు బాధ్యత తీసుకోవాలని సూచన
  • వైద్య చరిత్రలోనే గొప్ప ఫీట్ అవుతుందని కామెంట్
  • మహమ్మారిని తరిమేద్దామని పిలుపు
2022 నాటికి ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్లు వేసేలా జీ7 కూటమిలోని ధనిక దేశాలు బాధ్యత తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. వచ్చే వారం జరగనున్న జీ7 సదస్సులో దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ లో మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో బ్రిటన్ తో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ లు పాల్గొంటాయి.

వచ్చే ఏడాది నాటికి ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్లు వేయడం వైద్య చరిత్రలోనే ఓ గొప్ప ఫీట్ అవుతుందన్నారు. భయంకర మహమ్మారిని తరిమేసేందుకు మిత్ర దేశాలన్నీ కలిసి రావాలని, మళ్లీ ఆ మహమ్మారి దరి చేరకుండా చూడాలని పిలుపునిచ్చారు. కాగా, వ్యాక్సిన్లపై ఉన్న పేటెంట్ హక్కులను రద్దు చేయాలని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ అన్నారు. పేద దేశాలకు ధనిక దేశాలు టీకాలను పంపించాల్సిన అవసరం ఉందని ఆమె తేల్చి చెప్పారు.


More Telugu News