తన అభిమానుల సేవలను వీడియో రూపంలో పంచుకున్న రామ్ చరణ్
- కరోనా వేళ అభిమానుల సేవా కార్యక్రమాలు
- ఫ్యాన్స్ సేవలకు రామ్ చరణ్ ఫిదా
- అభిమానులకు పేరుపేరునా శుభాభినందనలు
- అంకితభావంతో పనిచేశారంటూ కితాబు
కరోనా సంక్షోభం సమయంలో తన అభిమానులు చేసిన సామాజిక సేవాకార్యక్రమాల పట్ల టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. మీ అందరి అంకిత భావానికి ధన్యవాదాలు అంటూ ప్రత్యేకంగా ఓ ప్రకటన చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందికి సాయం చేశారని, అభిమానులందరికీ పేరుపేరునా శుభాభినందనలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.
"అభిమానులు ఈ కొవిడ్-19 సమయంలో ఎంతో కష్టపడి సమాజసేవ చేస్తుండడాన్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సాయపడడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పనిచేశారు" అని కొనియాడారు. ఈ సందర్భంగా అభిమానుల సేవాకార్యక్రమాల ఫొటోలతో కూడిన ఓ వీడియోను కూడా రామ్ చరణ్ పంచుకున్నారు.