'పుష్ప' విలన్ విషయంలో సుకుమార్ నిర్ణయం!
- షూటింగు దశలో 'పుష్ప'
- రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు
- తెలుగు భాషపై ఫహాద్ కసరత్తు
సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడు. అయితే రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా 'అనుకోని అతిథి' సినిమా 'ఆహా'లో వచ్చింది. ఈ సినిమాలో అతని పాత్రకి హీరో తరుణ్ తో డబ్బింగ్ చెప్పించారు. దాంతో 'పుష్ప'లో కూడా అతనితోనే డబ్బింగ్ చెప్పిస్తారేమోనని అంతా అనుకున్నారు. అలా చేస్తే ఆ పాత్రలో తరుణ్ కనిపిస్తాడని చెప్పుకున్నారు.
కానీ సుకుమార్ ఆలోచన వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంతవరకూ ఫహాద్ ఫాజిల్ తోనే డబ్బింగ్ చెప్పించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడట. అందువలన ఫహాద్ ఫాజిల్ కి చిత్తూరు యాస నేర్పించడానికి తగిన ఏర్పాట్లు చేశాడట. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి భాషపై గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు. షూటింగు పూర్తయ్యేసరికి ఫహద్ ఫాజిల్ నేర్చేసుకుంటే ఆయనతోనే డబ్బింగ్ చెప్పిస్తారన్న మాట. లేదంటే మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ ను లైన్లో పెట్టేస్తారని అంటున్నారు.