ఏపీలో కొత్తగా 10,413 కరోనా పాజిటివ్ కేసులు, 83 మరణాలు
- గత 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరిలో 2,075 కొత్త కేసులు
- చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి
- 15,469 మందికి కరోనా నయం
- 1,33,773 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,413 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి (2,075), చిత్తూరు (1,574) జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 293 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 15,469 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 83 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మరణించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,296కి చేరింది.
ఇప్పటివరకు ఏపీలో 17,38,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 15,93,921 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,33,773 మంది చికిత్స పొందుతున్నారు.