ప్రముఖ కథకుడు కారా మాస్టారు మృతికి సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
- వృద్ధాప్య సమస్యలతో కాళీపట్నం రామారావు కన్నుమూత
- విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
- ఉత్తరాంధ్ర మణిపూస అంటూ కితాబు
- సాహితీ లోకానికి తీరని లోటన్న చంద్రబాబు
తెలుగు సాహితీచరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకున్న ప్రముఖ కథకుడు, కారా మాస్టారుగా గుర్తింపు పొందిన కాళీపట్నం రామారావు కన్నుమూయడం తెలిసిందే. 96 ఏళ్ల కారా మాస్టారు వృద్ధాప్య సమస్యలతో శ్రీకాకుళంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆ కథా స్రష్ట మృతి పట్ల ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. కారా మాస్టారు ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలలో మణిపూస వంటివారని, తన కథలతో వెలుగులు పంచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
అటు, విపక్షనేత చంద్రబాబు కూడా ట్విట్టర్ లో స్పందించారు. కారా మాస్టారు అంటూ అభిమానులతో పిలిపించుకున్న కాళీపట్నం రామారావు గారి మరణం విచారకరమని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించి తెలుగు కథలకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేశారని కీర్తించారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కాళీపట్నం రామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.