సమస్యల పరిష్కారం కోరుతూ.. 14, 15వ తేదీల్లో ఏపీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

  • కరోనా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలి
  • కరోనా బారినపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి
  • బొత్సకు సమ్మె నోటీసు ఇచ్చిన పారిశుద్ధ్య కార్మిక సంఘం నేతలు
సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 14, 15వ తేదీల్లో సమ్మె చేయనున్నట్టు ఏపీ పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నోటీసు అందించారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్టు ఏపీ మునిసిపల్ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సుబ్బారావు, కె. ఉమామహేశ్వరరావు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు  అందించాలని, కరోనా బారినపడిన కార్మికులకు మెరుగైన వైద్యం, హెల్త్ అలవెన్సు, జీతాల బకాయిలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. ఇందులో ప్రజారోగ్య విభాగంతోపాటు ఇంజనీరింగ్ కార్మికులు, పాఠశాలల్లో స్వీపర్లు కూడా పాల్గొంటారని తెలిపారు.


More Telugu News