ఏపీలో రికవరీ రేటు 91 శాతానికి పెరిగింది: ఏకే సింఘాల్
- ఏపీలో నెమ్మదించిన కరోనా
- 11 వేలకు అటూఇటూగా కొత్త కేసులు
- పాజిటివిటీ రేటు 13 శాతానికి తగ్గిందన్న సింఘాల్
- రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుతున్నాయని వెల్లడి
ఏపీలో రెండు నెలలుగా సాగుతున్న కరోనా సెకండ్ వేవ్ విజృంభణ క్రమంగా నెమ్మదిస్తోంది. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయని తెలిపారు. నాలుగు జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్న ప్రచారంలో నిజంలేదని వివరించారు.
ఏపీలో కరోనా కేసుల రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని చెప్పారు. పాజిటివిటీ రేటు 13 శాతానికి తగ్గిందని సింఘాల్ వెల్లడించారు. ఏపీలో గత 24 గంటల్లో 11,421 పాజిటివ్ కేసులు నమోదు కావడం తెలిసిందే. గత వారం రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. వ్యాక్సినేషన్ ఊపందుకుంటే కొత్త కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.