క్లీన్ ఎనర్జీ జాబితాలో ఏపీకి జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్
- జాతీయ అభివృద్ధి ర్యాంకులు విడుదల చేసిన నీతి ఆయోగ్
- ఏపీకి మరోసారి విశిష్ట గుర్తింపు
- స్థిర ఆర్థికాభివృద్ధి జాబితాలో ఏపీకి 3వ స్థానం
- గతేడాది కంటే 5 పాయింట్లు అధికంగా పొందిన ఏపీ
నీతి ఆయోగ్ 2020-21కి సంబంధించి జాతీయ ర్యాంకులు విడుదల చేసింది. వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబర్చినందుకు ఏపీకి మరోసారి విశిష్ట గుర్తింపు లభించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో ఏపీకి మొదటి ర్యాంకు లభించింది. స్థిర ఆర్థికాభివృద్ధి జాబితాలోనూ ఏపీ ముందంజలో నిలిచింది. స్థిర ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో 3వ ర్యాంకు దక్కింది. ఏపీ 72 పాయింట్లతో టాప్-5లో నిలిచింది. 2020లో ఏపీకి 67 పాయింట్లు రాగా, ఈసారి 5 పాయింట్లు అధికంగా సాధించింది.
ఈ జాబితాలో కేరళ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది. సిక్కిం, మహారాష్ట్ర వరుసగా 4, 5వ ర్యాంకుల్లో నిలిచాయి. ఇక అధ్వాన పనితీరు కనబర్చిన రాష్ట్రాలుగా బీహార్, ఝార్ఖండ్, అసోం అపఖ్యాతి మూటగట్టుకున్నాయి. జాబితాలో ఇవి చిట్టచివర నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అగ్రస్థానం నిలుపుకోగా, ఢిల్లీ రెండోస్థానం దక్కించుకుంది.