అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు
- పొన్నవోలు తనపై దురుసు వ్యాఖ్యలు చేశారన్న రఘురామ
- ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్నారని ఆరోపణ
- న్యాయవాద వృత్తికి అనర్హుడని వెల్లడి
- పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఏపీ సీఐడీ తనను అరెస్ట్ చేయడం, తదనంతర పరిణామాలపై ఆయన ఢిల్లీలో పెద్దలను కలుస్తూ ఫిర్యాదులు చేస్తుండడం తెలిసిందే. ఇప్పటికే ఆయన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్ హెచ్చార్సీ చైర్మన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలను కలిసి ఫిర్యాదు చేశారు. తాజాగా రఘురామకృష్ణరాజు ఏపీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్నారని ఆరోపించారు.
కొన్ని చానళ్లలో పొన్నవోలు తనపై దురుసు వ్యాఖ్యలు చేశారని వివరించారు. హైకోర్టు పెద్దమనసుతో పొన్నవోలుకు హెచ్చరికలతో సరిపెట్టిందని ఆయన అన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడడం క్షమించరానిదని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాద వృత్తికి పొన్నవోలు అర్హుడు కాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ ను కోరారు.