లాక్ డౌన్ వేళ విహారం... టైగర్ ష్రాఫ్, దిశా పటానీపై కేసు నమోదు
- ముంబయిలో లాక్ డౌన్ వేళ కారులో టైగర్, దిశా షికారు
- జిమ్ నుంచి వస్తుండగా అడ్డుకున్న పోలీసులు
- నియమావళిని అతిక్రమించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు
- తనయుడికి మద్దతుగా మాట్లాడిన టైగర్ తల్లి
బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ వేళ బయట కనిపించారన్న ఆరోపణలతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిద్దరూ జిమ్ లో వ్యాయామం చేసిన అనంతరం సరదాగా కారులో షికారుకు వెళ్లగా, బాంద్రా ప్రాంతంలో పోలీసులు నిలువరించినట్టు తెలుస్తోంది. కారణం లేకుండా బయటికి వచ్చి, లాక్ డౌన్ నియమావళిని అతిక్రమించారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
అయితే, టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా ష్రాఫ్ మాత్రం తనయుడికి మద్దతుగా స్పందించారు. "ఇలాంటి సమయంలో షికారు చేయడానికి ఎవరు ఇష్టపడతారు? వారు ఇంటికి వస్తుంటే పోలీసులు ఆపి ఆధార్ కార్డులు అడిగారట! కేసు నమోదు చేసే ముందు ఒకసారి నిర్ధారించుకోవాలి" అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
టైగర్, దిశా సాన్నిహిత్యంపై బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తుండగా, వారిద్దరూ ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తూ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంటారు.