తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. నేడు కేరళను తాకనున్న రుతుపవనాలు
- తెలంగాణపై గాలుల విచ్ఛిన్నత
- నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు
- నిన్న అత్యధికంగా ఆరుట్లలో 4.5 సెంటీమీటర్ల వర్షం
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. తెలంగాణపై 1500 మీటర్ల ఎత్తు వరకు గాలుల విచ్ఛిన్నత ఏర్పడినట్టు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు, రేపు రోజంతా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురవగా, గచ్చిబౌలిలో 4.5, నల్గొండ జిల్లా ఎర్రారంలో 4.4, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 3.8, మాదాపూర్‌లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసింది.