డాక్టర్ రోజీ మరణం తీవ్రంగా కలచివేసింది: నారా లోకేశ్
- కరోనాతో యువ డాక్టర్ మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
- డాక్టర్ రోజీ మృతికి సంతాపం
- కన్నవాళ్లకు తీరని శోకం మిగిల్చిందని వెల్లడి
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రోజీ అనే యువ వైద్యురాలు కరోనాతో మృతి చెందడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ రోజీ మరణం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన రోజీ నీట్ రాసి మంచి ర్యాంకుతో ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిందని లోకేశ్ వెల్లడించారు. అక్కడే ఎంబీబీఎస్ పూర్తిచేసి, అదే కాలేజీలో హౌస్ సర్జన్ గా చేరడం గర్వకారణం అని వివరించారు.
అయితే, కొవిడ్ బాధితులకు సేవలందిస్తూ డాక్టర్ రోజీ వైరస్ బారినపడి కన్నుమూసిందని తెలిపారు. కన్నవాళ్లకు తీరని శోకం మిగిల్చిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న రోజీ అకాలమరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో ఎంతోమందికి ప్రాణభిక్ష పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.