ఏపీలో ఇప్పటివరకు 15 శాతం మందికి టీకాలు వేశాం: కమిషనర్ భాస్కర్
- ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
- వివరాలు తెలిపిన కమిషనర్ కాటంనేని భాస్కర్
- రోజుకు 6 లక్షల డోసులు అందించే సామర్థ్యం ఉందని వెల్లడి
- దేశ సగటును మించి రాష్ట్రంలో టీకాలు ఇచ్చినట్టు వివరణ
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం రోజుకు 6 లక్షల టీకా డోసులు అందించే సామర్థ్యం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ లో దేశ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సిన్లు అందిస్తున్నామని వివరించారు. ఏపీలో నిన్నటివరకు 1,01,68,000 వేల మందికి పైగా రెండు డోసులు వేశామని తెలిపారు. రాష్ట్రంలో 15 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని పేర్కొన్నారు.