డైరెక్షన్ చేస్తానంటున్న నివేద థామస్!

  • కథానాయికగా మంచి క్రేజ్
  • ఆరంభంలోనే పడిన వరుస హిట్లు
  • డైరెక్షన్ కోర్స్ చేశానంటున్న నివేద  
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో అందంతో పాటు అభినయంతోను మెప్పించినవారి జాబితాలో నివేద థామస్ పేరు కనిపిస్తుంది. నాని 'జెంటిల్ మేన్' సినిమా ద్వారా పరిచయమైన నివేద థామస్, తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టేసింది. ఆ తరువాత చేసిన 'నిన్నుకోరి' .. 'జై లవ కుశ' సినిమాలు కూడా ఆమెకు భారీ విజయాలను అందించాయి. '118' .. ' బ్రోచేవారెవరురా' సినిమాలు కూడా ఆమె కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి.

అలాంటి నివేద థామస్ దృష్టి డైరెక్షన్ పై ఉందట. మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశానని చెప్పింది. హీరోయిన్ గా కొంతకాలం చేసిన తరువాత, తాను మెగా ఫోన్ పడతానని అంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాననీ, ఆ తరువాతనే సినిమా వైపు వస్తానని చెప్పింది. దర్శకురాలిగా కూడా రాణించగలననే బలమైన నమ్మకమే ఉందని అంది. మొత్తానికి నివేద థామస్ పక్కా ప్లానింగ్ తోనే ఉందన్న మాట.


More Telugu News