కరోనా సమయంలో కూడా పోలవరం పనులు ఆగలేదు: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- పోలవరం డ్యామ్ పనులను పరిశీలించిన మంత్రి
- పనుల్లో పురోగతి ఉందని వ్యాఖ్య
- 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న అనిల్
పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పరిశీలించారు. పనుల పురోగతికి సంబంధించిన విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్రోచ్ ఛానల్ మట్టి తవ్వకం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పారు. పనుల్లో పురోగతి ఉందని తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అనిల్ కుమార్ పర్యటన సందర్భంగా ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, స్థానిక వైసీపీ నేతలు, నిర్మాణ సంస్థ అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు.