పాకిస్థాన్ జైల్లో నరకం అనుభవించాను: తెలంగాణ యువకుడు ప్రశాంత్
- సోషల్ మీడియా ద్వారా పాక్ అమ్మాయి పరిచయం
- తన ప్రియురాలి కోసం దేశ సరిహద్దులు దాటిన ప్రశాంత్
- విచారణ సందర్భంగా నరకం చూపించారని వ్యాఖ్య
ప్రేమించిన పాకిస్థాన్ అమ్మాయి కోసం దేశ సరిహద్దులను దాటి శత్రుదేశం పాకిస్థాన్ లో అడుగుపెట్టిన తెలంగాణ యువకుడు ప్రశాంత్ కథ చివరకు సుఖాంతం అయింది. పాక్ లో ఎన్నో బాధలను అనుభవించిన ఆయన చివరకు అక్కడి జైలు నుంచి రిలీజ్ అయి హైదరాబాదుకు చేరుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఓ పాకిస్థాన్ అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఆమెను కలవడానికి జీవితాన్నే పణంగా పెట్టాడు. 2017లో సరిహద్దులను దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు.
ఎడారి ప్రాంతాన్ని దాటుతూ పాకిస్థాన్ సైనికులకు ప్రశాంత్ చిక్కాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆయన వివరించాడు. తాను సైనికులకు దొరికిన సమయంలో తనకు మంచి ఆహారాన్ని అందించారని చెప్పాడు. ఆ తర్వాత తనను విచారించే సమయంలో మాత్రం తీవ్రంగా కొట్టారని తెలిపాడు. రెండేళ్ల పాటు తనకు నరకం చూపించారని చెప్పాడు. ఆ తర్వాత క్రమంగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని తెలిపాడు. తన మాదిరే ఎంతో మంది భారతీయులు పాక్ జైళ్లలో నరకం అనుభవిస్తున్నారని చెప్పాడు. వారందరినీ కూడా విడుదల చేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరాడు.