ఇంటి వద్దకే ఆనందయ్య మందు... ఆన్ లైన్ విధానంలో పంపిణీ

  • నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం
  • హాజరైన ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని
  • మందు పంపిణీపై చర్చ
  • విధివిధానాల ఖరారు
  • ప్రజలు నేరుగా రావొద్దని విజ్ఞప్తి
మొన్నటివరకు ఆనందయ్య అంటే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, ఆ పరిసర ప్రాంతాల వాసులకు తప్ప మిగతావారికి తెలియదు. కానీ ఇప్పుడాయన ఓ సెలబ్రిటీ స్థాయిలో ప్రచారం పొందుతున్నారు. దీనికంతటికీ కారణం ఆయన అందించే కరోనా మందే. ఇప్పుడా మందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు, హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో పంపిణీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే, ఈసారి ఆన్ లైన్ విధానంలో ఆనందయ్య మందు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇకపై ప్రజలు కృష్ణపట్నం రావొద్దని, ఆన్ లైన్ విధానంలో ఇంటి వద్దకే మందు అందజేస్తారని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. మందు పంపిణీ విధివిధానాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా మందు పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.


More Telugu News