వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న రామ్!
- లింగుస్వామితో రామ్ తాజా చిత్రం
- మాస్ అంశాలతో సాగే కథ
- కథానాయికగా కృతి శెట్టి
- యూత్ లో పెరుగుతున్న ఆసక్తి
నిన్నమొన్నటి వరకూ లవర్ బోయ్ .. చాక్లెట్ బోయ్ అనిపించుకున్న రామ్, ఇప్పుడు మాస్ హీరోగా సందడి చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన హిట్ తో ఆయన నిర్ణయం మరింత బలపడింది. 'రెడ్' సినిమాలోను మాస్ లుక్ తో కనిపించాడు. ఇక ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్న సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథనే. ఈ పాటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ పూర్తికావలసింది. కానీ కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లలేదు.
కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేయించిన లింగుస్వామి, ఇతర పనులపై దృష్టిపెట్టాడని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయిక కావడంతో, ఈ ప్రాజెక్టుపై కూడా యూత్ లో ఆసక్తి ఉంది. ఈ జోడీ తెరపై ఎలా ఉంటుందో చూడాలనే ఆత్రుత ఉంది. సాధ్యమైనంత వరకూ ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.