ఏపీలో మరో 11,303 మందికి కరోనా... 104 మరణాలు
- గత 24 గంటల్లో 93,704 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 2,477 కొత్త కేసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది మృతి
- 11 వేలు దాటిన కరోనా మరణాలు
- ఇంకా 1,46,737 మందికి చికిత్స
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. నిన్న 7 వేల కనిష్ఠానికి దిగొచ్చిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 93,704 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,477 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,536 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,116 కేసులు గుర్తించారు. మిగతా జిల్లాల్లో వెయ్యికి లోపే రోజువారీ కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 18,257 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మృతి చెందారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 20 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లాలో 14 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,04,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 15,46,617 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,46,737 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 11,034కి చేరింది.