మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో భారీ క్షీణత
- మే నెలలో 46 వేల కార్ల అమ్మకం
- ఈ ఏడాది ఏప్రిల్ లో లక్షకు పైగా కార్ల విక్రయం
- సెకండ్ వేవ్ ప్రభావంతో పాక్షికంగా నిలిచిన ఉత్పత్తి
- తన ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా చేసిన మారుతి
- గతేడాదితో పోల్చితే మెరుగైన రీతిలో అమ్మకాలు
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీపైనా పడింది. మే నెలలో మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో భారీ క్షీణత కనిపించింది. గత నెలలో మారుతి సంస్థ కేవలం 46,555 కార్లను విక్రయించింది. ఏప్రిల్ లో 1,59,691 కార్లను విక్రయించిన మారుతి సంస్థ అదే ఒరవడిని కొనసాగించలేకపోయింది. అయితే గతేడాది మే నెలతో పోల్చితే ఈసారి మారుతి అమ్మకాలు మెరుగనే చెప్పాలి. 2020 మే నెలలో మారుతి సుజుకి సంస్థ 18,539 కార్లను మాత్రమే విక్రయించగలిగింది.
గత కొన్నినెలలుగా దేశంలో కరోనా వ్యాప్తి మహోగ్రంగా కొనసాగడంతో, అనేక రాష్ట్రాలు లాక్ డౌన్లు ప్రకటించాయి. దాంతో కార్ల అమ్మకాలు నిరాశాజనకంగా సాగాయి. ఓ దశలో ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో మారుతి సంస్థ మే 1 నుంచి 16వ తేదీ వరకు ఉత్పిత్తి నిలిపి వేసింది. తన యూనిట్ల నుంచి ఆక్సిజన్ ను దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేసింది.