పవన్ కల్యాణ్ పెద్ద డైనమైట్: విజయేంద్ర ప్రసాద్
- పవన్ కోసం పత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదు
- ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు తీసుకుంటే కథ రెడీ అయిపోతుంది
- డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల చాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ ఒక డైనమైట్ అని అన్నారు. ఓ టీని షోలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని... ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందని చెప్పారు.
పవన్ ను చూడ్డానికే ప్రజలు సినిమాలకు వస్తారని... ఆయనను చూపించడంతో పాటు అమ్మాయిలతో సాంగులు, విలన్లను చితగ్గొట్టడం, ప్రజలకు మంచి చేయడం వంటివి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందని అన్నారు. డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందని... పవన్ పెద్ద డైనమైట్ అని చెప్పారు.
ఆయన సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదే సమయంలో మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ... మహేశ్ కు కథ రాయాలంటే పూరి జగన్నాథ్ ను అడగాల్సిందేనని విజయేంద్ర ప్రసాద్ చమత్కరించారు.