అప్పుడు కష్టపడి తండ్రిని కాపాడుకుంది.. ఇప్పుడు కోల్పోయింది!
- 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయి తండ్రి మృతి
- గుండెపోటుతో మరణించిన జ్యోతి నాన్న
- గత ఏడాది లాక్ డౌన్ లో తండ్రిని తీసుకుని సైకిల్ పై పయనం
జ్యోతి గుర్తుందా? పోనీ తన తండ్రి కోసం వారం పాటు 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయి గుర్తుందా? అవును, ఆ 15 ఏళ్ల అమ్మాయి తన పేరుతో కంటే.. తండ్రి కోసం సైకిల్ తొక్కిన అమ్మాయిగానే చిరపరిచితం. లాక్ డౌన్ లో ఉపాధి కరవై తన తండ్రిని తీసుకుని సైకిల్ పై బీహార్ లోని తన సొంతూరికి చేరి వార్తల్లోకెక్కిన ఆ అమ్మాయి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కూ ఎంపికైంది.
అయితే, ఆ అమ్మాయి ఇంట్లో విషాదం నెలకొంది. తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపించే ఆ అమ్మాయి.. ఆ ప్రేమనే పోగొట్టుకుంది. గుండెపోటుతో ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఎన్నో బాధలు పడి, రెండు రోజులు తిండికి తిప్పలు పడి సొంతింటికి చేరినా.. తన తండ్రిని పోగొట్టుకుని ఇప్పుడు మరిన్ని బాధలు పడుతోంది.