'వీరమల్లు'పై మరింత ఆసక్తిని పెంచుతున్న టాక్!
- మొఘల్ కాలంలో నడిచే కథ
- భారీ సెట్ల కోసం కోట్ల ఖర్చు
- డిఫరెంట్ లుక్స్ తో పవన్ కల్యాణ్
- కథానాయికగా నిధి అగర్వాల్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'హరిహర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొఘల్ చక్రవర్తుల కాలంనాటి కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ కాలంనాటి వాతావరణానికి అద్దం పడుతూ భారీ సెట్లు వేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు, త్వరలో మళ్లీ మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు. అందువల్లనే పవన్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు.
ఈ సినిమాలో 'వీరమల్లు' అనే వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దీంతో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అయితే కథాపరంగా ఆయన మరో రెండు డిఫరెంట్ లుక్స్ లో కూడా కనిపించనున్నాడనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. తనని అన్వేషిస్తున్న సైనికుల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన గెటప్స్ మారుస్తాడా? లేదంటే అలాంటి సందర్భం మరేదైనా ఉందా? అనేది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిధి అగర్వాల్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో,బాలీవుడ్ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.