బ్రిడ్జిపై వింత ఆకారం... 'దెయ్యం'.. 'ఏలియన్' అంటూ ప్రచారం!

  • ఝార్ఖండ్, హజారీబాగ్ జిల్లాలో ఘటన
  • చాడ్వా డ్యామ్ వంతెనపై ఆకారాన్ని గుర్తించిన వాహనదారులు
  • వీడియో తీసిన ఒక వాహనదారు 
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఝార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలోని ఓ బ్రిడ్జిపై వింత ఆకారం కలకలం సృష్టించింది. ఇక్కడి చాడ్వా డ్యామ్ వంతెనపై రాత్రిపూట వాహనదారులకు ఓ విచిత్ర ఆకారం కనిపించింది. బైక్ మీద అటుగా వచ్చిన వ్యక్తులు దీన్ని వీడియోగా రికార్డు చేశారు.  

బ్రిడ్జిపై వెళుతున్న పలువురు వాహనదారులు ఈ వింత ఆకారాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. ఆ ఆకారాన్ని గుర్తించి  తమ వాహనాలు దూరంగా నిలిపివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

కాగా, కొందరు దీనిని దెయ్యం అంటుంటే... మరికొందరు ఏలియన్ (గ్రహాంతర జీవి) గా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇదంతా ఎవరో తమాషా కోసం చేసిన ప్రాంక్ అంటూ మరికొందరు కొట్టిపారేస్తున్నారు. మరోపక్క, దీని సంగతేంటో కాస్త చూడండంటూ మరికొందరు ఈ వీడియోను నాసాకు, ఇస్రోకు, ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేస్తున్నారు.


More Telugu News