తెలంగాణలో పాఠశాలల వేసవి సెలవులు జూన్ 15 వరకు పొడిగింపు
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- కీలక నిర్ణయం తీసుకున్న పాఠశాల విద్యాశాఖ
- స్కూళ్లతో పాటు డైట్ కాలేజీలకూ సెలవుల పొడిగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు, పాఠశాలలతో పాటు డైట్ కాలేజీలకు ఈ వేసవి సెలవుల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని, అందుకే సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.