అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
- నగర ప్రజలకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక
- భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు పత్రాలను చూపించాలని సూచన
తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను విధించడం వల్ల కరోనా కేసులు కొంత మేర తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు.
లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని... నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఆయన కూకట్ పల్లి, జేఎన్టీయూ చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెట్రోల్ బంకులు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు స్లాట్ బుక్ చేసుకోవాలని... రోడ్లపై పోలీసులకు వాటిని చూపించాలని తెలిపారు. పోలీసులకు అందరూ సహకరించాలని చెప్పారు.