ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల... రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- దేశంలో కరోనా సెకండ్ వేవ్
- కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- ప్రయాణాలు చేసేందుకు ప్రజలు వెనుకంజ
- జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుండడంతో ప్రజలు రైళ్లలో ప్రయాణాలకు వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్ డౌన్లు కొనసాగుతుండడం కూడా ప్రయాణికుల తగ్గుదలకు కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల పోతుండడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని పేర్కొంది.
రద్దు చేసిన రైళ్ల వివరాలు...
రద్దు చేసిన రైళ్ల వివరాలు...
- గూడూరు-విజయవాడ
- విజయవాడ-గూడూరు
- గుంటూరు-వికారాబాద్
- వికారాబాద్-గుంటూరు
- విజయవాడ-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-విజయవాడ
- బీదర్-హైదరాబాద్
- సికింద్రాబాద్-బీదర్
- సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్
- నర్సాపూర్-నిడదవోలు
- నిడదవోలు-నర్సాపూర్
- కాచిగూడ-గుంటూరు
- గుంటూరు-కాచిగూడ
- ఆదిలాబాద్-హెచ్ఎస్ నాందేడ్
- హెచ్ఎస్ నాందేడ్-ఆదిలాబాద్
- పర్బని-హెచ్ఎస్ నాందేడ్
- చెన్నై సెంట్రల్-తిరుపతి
- తిరుపతి-చెన్నై సెంట్రల్
- విజయవాడ-చెన్నై సెంట్రల్
- చెన్నై సెంట్రల్-విజయవాడ