ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతి

  • ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
  • ఆనందయ్య మందుపై నేడు హైకోర్టులో విచారణ
  • చుక్కల మందుపై గురువారం లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ గురువారానికి వాయిదా
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

మధ్యాహ్నం 1 గంట సమయానికి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేసింది. కోర్టులో విచారణ పునఃప్రారంభమైన అనంతరం, ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


More Telugu News