ఢిల్లీ బయలుదేరిన బండి సంజయ్.. ఈటల కోసమే!
- బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్?
- ఈ రోజు సాయంత్రమే నడ్డాతో భేటీ ఖరారు
- ఇప్పటికే ఢిల్లీకి ఈటల, రవీందర్, వివేక్
- కాసేపట్లో ఢిల్లీకి కిషన్ రెడ్డి
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి కూడా ఉండడం గమనార్హం.
అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఈటల, రవీందర్ రెడ్డి, వివేక్, బండి సంజయ్ కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.
మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్న విషయం తెలిసిందే. అదే రోజు ఈటల బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ రోజు రాత్రి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.