తెలంగాణలో బాగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు
- 1,801 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు
- రాష్ట్రంలో 16 మంది మృతి
- 93.34 శాతానికి పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. గత కొన్నివారాలతో పోల్చితే తొలిసారిగా 2 వేల లోపున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,75,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,37,522 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 35,042 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,263కి చేరింది. రికవరీ రేటు 93.34 శాతానికి పెరిగింది.