ఏపీలో కొత్తగా 13,400 కొవిడ్ కేసులు, 94 మరణాలు
- ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా సెకండ్ వేవ్
- గత 24 గంటల్లో 84,232 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 2,598 కొత్త కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 362 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,65,795
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గడమే కాదు, మరణాలు కూడా 100కి లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 84,232 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో 2,598 కేసులు నమోదు కాగా, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 362 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 21,133 మంది కరోనా నుంచి కోలుకోగా, 94 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మృత్యువాతపడ్డారు. దాంతో, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10,832కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,85,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 15,08,515 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 1,65,795 మందికి చికిత్స కొనసాగుతోంది.