ఆనందయ్యను రహస్య ప్రాంతంలో ఉంచిన పోలీసులు
- నిన్న తెల్లవారుజామున తీసుకెళ్లిన పోలీసులు
- స్థానికులు పెద్ద ఎత్తున నిరసన
- కృష్ణపట్నంలో 144 సెక్షన్
- ఆనందయ్య ఔషధంపై రేపు తుది నివేదిక
నాటు వైద్యుడు ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచారు. కృష్ణపట్నంలో ఆయన కరోనాకు మందు ఇస్తున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. నిన్న తెల్లవారుజామున పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆనందయ్యకు భద్రత కల్పిస్తూ పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు.
కృష్ణ పట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముత్తుకూరు నుంచి వచ్చే స్థానికేతరులకు అనుమతి నిరాకరిస్తున్నారు. కృష్ణపట్నం, గోపాలపురంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి అంబులెన్సుల్లో రోగులు వస్తున్నారు. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. మరోవైపు, ఆనందయ్య ఔషధంపై రేపు తుది నివేదిక రానుంది.