దేశంలో క్ర‌మంగా త‌గ్గుతోన్న క‌రోనా కేసులు

  • నిన్న 1,65,553 క‌రోనా కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య  2,78,94,800
  • మృతుల సంఖ్య మొత్తం 3,25,972
  • 21,20,66,614 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. నిన్న 1,65,553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న  2,76,309 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,78,94,800కు చేరింది. మరో 3,460 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,25,972 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,54,54,320  మంది కోలుకున్నారు. 21,14,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,20,66,614 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,31,83,748  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,63,839 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


More Telugu News