సరుకులు మోసుకుంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన చైనా వ్యోమనౌక
- అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో చైనా వడివడిగా అడుగులు
- తియాన్హే పేరుతో నిర్మాణం
- లాంగ్‌మార్చ్-7వై3 రాకెట్ ద్వారా వ్యోమనౌకను పంపిన చైనా
- ఆహారం, సరుకులు, రెండు టన్నుల ఇంధనంతో నింగికెగసిన తియాన్‌ఝౌ-2
తనకంటూ ఓ తియాన్హే పేరుతో భూ కక్ష్యలో ఓ అంతరిక్షకేంద్రాన్ని నిర్మించుకుంటున్న చైనా ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రితో నిన్న చైనా సరుకు రవాణా వ్యోమనౌక తియాన్‌ఝౌ-2 నింగిలోకి పయనమైంది. లాంగ్‌మార్చ్-7 వై3 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపారు. నిజానికీ ప్రయోగం గత వారమే జరగాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది.
అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన భాగం ఇప్పటికే రోదసీలోకి చేరుకోగా, తాజాగా నిన్న తియాన్‌ఝౌ-2 మరికొన్ని విడిభాగాలను తీసుకుని పయనమైంది. అంతరిక్ష కేంద్రానికి మున్ముందు వెళ్లబోయే వ్యోమగాముల కోసం ఆహారం, సరుకులు, సైన్స్ పరికరాలు, అంతరిక్ష కేంద్రం కోసం రెండు టన్నుల ఇంధనాన్ని ఇది తీసుకెళ్లింది. త్వరలోనే ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-12 వ్యోమనౌకలో అక్కడికి వెళ్లనున్నారు. మూడు నెలలపాటు వారు అక్కడే ఉండి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తారు.