దేశంలో కొత్తగా 166 గ్రీన్ జోన్లను గుర్తిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటన

  • దేశంలో డ్రోన్ల వినియోగానికి కేంద్రం చర్యలు
  • ఏపీలో 4, తెలంగాణలో 9 గ్రీన్ జోన్ల గుర్తింపు
  • 400 అడుగుల వరకు డ్రోన్లు ఎగురవేసే అవకాశం
  • స్థానిక అధికారుల అనుమతితో డ్రోన్లు ఎగరేసే అవకాశం
దేశంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 166 గ్రీన్ జోన్లను గుర్తిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటన చేసింది. వీటికి నో పర్మిషన్, నో టేకాఫ్ జోన్ నుంచి మినహాయింపునిచ్చారు. తెలంగాణలో 9, ఏపీలో 4 కొత్త గ్రీన్ జోన్లను గుర్తించారు. ఏపీలో అనంతపురం, మదనపల్లితో పుట్టపర్తిలోని రెండు ప్రదేశాలను గ్రీన్ జోన్లుగా గుర్తించారు.

కేంద్రం తాజా ప్రకటనతో కొత్త గ్రీన్ జోన్లలో డ్రోన్ల వినియోగానికి అవకాశమిచ్చినట్టయింది.  స్థానిక అధికారుల నుంచి అనుమతి పొంది డ్రోన్లు ఎగురవేయొచ్చు. అనుమతులు ఉన్న ప్రదేశాల్లో 400 అడుగుల వరకు డ్రోన్లు ఎగురవేసే అవకాశం ఉంటుంది. నూతన గ్రీన్ జోన్ పాలసీతో దేశవ్యాప్తంగా డ్రోన్ల వాడకం ఊపందుకుంటుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.


More Telugu News