సంతోష్ శోభన్ చేతిలో కొత్త సినిమాలు!
- హీరోగా నిలదొక్కుకునే ప్రయాత్నాలు
- 'ఏక్ మినీ కథ'కు మంచి రెస్పాన్స్
- పెద్ద బ్యానర్లలో చేయనున్న ప్రాజెక్టులు
టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు పెరుగుతోంది. ఎవరికివారు కొత్త కాన్సెప్ట్ లతో యూత్ ను మెప్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసులో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కూడా ఉన్నాడు. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో ఈ అబ్బాయి ప్ర్రేక్షకులకు చేరువయ్యాడు. రీసెంట్ గా చేసిన 'ఏక్ మినీ కథ' అమెజాన్ ప్రైమ్' ద్వారా విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమా బయటికి రాకముందే ఈ కుర్రాడు వరుస సినిమాలను లైన్లో పెట్టేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలు చేయనున్నాడు. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలోను .. అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడితోను సినిమాలు చేయనున్నాడు. సంతోష్ శోభన్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించాడు. ఇదంతా చూస్తుంటే కుర్రాడు దూకుడు మీదే ఉన్నాడనిపిస్తోంది కదూ!