ఒకే వ్యక్తిలో మూడు ఫంగస్ లు... రక్తం విషపూరితంగా మారి మృతి
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- కరోనా బారినపడిన న్యాయవాది
- ఆసుపత్రిలో ఎండోస్కోపీ చేసిన వైద్యులు
- మూడు ఫంగస్ లు గుర్తింపు
- ఫలించని చికిత్స
దేశంలో కరోనా రోగులు ఫంగస్ ల బారినపడి మరణిస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులను విరివిగా గుర్తించారు. అయితే, ఒకే వ్యక్తిలో ఈ మూడు ఫంగస్ లు కనిపించగా, ఆ వ్యక్తి చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఘజియాబాద్ కు చెందిన కున్వర్ సింగ్ అనే న్యాయవాది ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేరగా, ఆయనకు ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీలో దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. కున్వర్ లాల్ శరీరంలో మూడు ఫంగస్ లను గుర్తించారు. వైద్యులు చేసిన చికిత్స కూడా ఫలించలేదు. ఫంగస్ ల కారణంగా రక్తం విషపూరితంగా మారడంతో గత రాత్రి మరణించాడు.