దేశ ప్రధాని అంటే ఓ వ్యవస్థ... అలాంటి వ్యవస్థను అవమానించారు: మమతపై పురందేశ్వరి ఆగ్రహం

  • నిన్న బెంగాల్ లో మోదీ ఏరియల్ సర్వే
  • యాస్ తుపాను నష్టంపై పరిశీలన
  • సమీక్ష సమావేశం చేపట్టిన మోదీ
  • మమత ఆలస్యంగా వచ్చారంటూ బీజేపీ ఫైర్
పశ్చిమ బెంగాల్ లో యాస్ తుపాను సమీక్ష సమావేశానికి ఆలస్యంగా రావడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా అవమానించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని అంటే ఓ వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

"యాస్ సైక్లోన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని బెంగాల్ కు వస్తే, ఆయనను 30 నిమిషాల పాటు మీకోసం వేచిచూసేలా చేశారు. పైగా సమీక్ష సమావేశం పూర్తికాక ముందే వెళ్లిపోయారు. తద్వారా ఆ వ్యవస్థను కించపరిచారు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.  


More Telugu News