తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు?
- తెలంగాణలో రేపటితో ముగుస్తున్న లాక్ డౌన్
- రేపు కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం
- లాక్ డౌన్ ను మరో వారం లేద 10 రోజులు పొడిగించే అవకాశం
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. రేపటితో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... లాక్ డౌన్ ను మరో వారం లేదా 10 రోజుల పాటు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.
రేపటి కేబినెట్ సమావేశంలో... ప్రస్తుత లాక్ డౌన్ ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉంది? అనే విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే మేలనే అభిప్రాయాన్ని వీరిలో ఎక్కువ మంది వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు.