బాలిక గర్భం దాల్చడానికి, నాకు ఎలాంటి సంబంధం లేదు: రాయికల్ మున్సిపల్ ఛైర్మన్
- జగిత్యాల జిల్లా రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక
- రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ హన్మాండ్లుపై అనుమానాలు
- సొంత పార్టీ వారే అసత్య ప్రచారం చేస్తున్నారన్న హన్మాండ్లు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఒక బాలిక గర్భం దాల్చడం రాజకీయ రంగు పులుముకుంది. రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు దీనికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్మాండ్లు స్పందిస్తూ, బాలిక గర్భం దాల్చడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
సొంత పార్టీలో ఉన్నవారే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 'అసలు నా వయసు ఏంటి... ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తానా?' అని ఆయన వాపోయారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, గర్భందాల్చిన బాలిక ప్రస్తుతం మాతా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉంది.