కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడికి జరిమానా విధించిన పోలీసులు

  • మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతం
  • తీవ్రస్థాయిలో కట్టడి చర్యలు
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకపోతే జరిమానా
  • మాస్కు లేకుండా కనిపించిన రాహుల్ త్రిపాఠీ
  • రూ.500 ఫైన్ వేసిన పూణే పోలీసులు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దృష్ట్యా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఎవరినీ ఉపేక్షించడంలేదు. అలాగే, పూణేలో మాస్కు లేకుండా కనిపించిన క్రికెటర్ రాహుల్ త్రిపాఠీని కూడా పోలీసులు వదల్లేదు.

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించే రాహుల్ త్రిపాఠీ ఖాదీ మెషీన్ చౌక్ వద్ద కారులో ప్రయాణిస్తుండగా మాస్కు లేకుండా కనిపించాడు. దాంతో, అతడిని నిలువరించిన పోలీసులు రూ.500 జరిమానా వేశారు. కారులో ఉన్నది క్రికెటర్ అని గుర్తించిన పోలీసులు, కరోనా మార్గదర్శకాలను గుర్తు చేశారు. మాస్కు ధరించకపోవడం తప్పిదమేనని గుర్తించిన రాహుల్ త్రిపాఠీ జరిమానా చెల్లించి, అక్కడ్నించి బయటపడ్డాడు.


More Telugu News