లాక్‌డౌన్ వేళ.. పోలీసుని చితగ్గొట్టిన స్థానికులు.. వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో ఘటన
- కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కొందరు చిరు వ్యాపారులు
- దుకాణాలు తెరవడంతో వెళ్లి కొట్టిన పోలీసు
- పోలీసును పట్టుకుని కర్రలతో బాదిన స్థానికులు
లాక్‌డౌన్ వేళ ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి తలపై ఓ పోలీసు లాఠీతో కొట్టాడు. దీంతో ఆ పోలీసును పట్టుకున్న స్థానికులు అతనిని చితగ్గొట్టేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో చోటు చేసుకుంది.
కరోనా నిబంధనలు ఉల్లంఘించి కొందరు చిరు వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని, వెంటనే దుకాణాలు మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, ఓ వ్యాపారిని ఓ పోలీసు లాఠీతో కొట్టాడు. దీంతో కొంతమంది ఆ పోలీసు వద్దకు దూసుకెళ్లి, అసభ్య పదజాలంతో తిడుతూ, విచక్షణారహితంగా కొట్టి ఈడ్చుకెళ్లారు.
మధ్యప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. అయితే, ఆ వ్యాపారుల్లో ఎవ్వరూ మాస్కు పెట్టుకోలేదు. జామ్‌తులి గ్రామంలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడంతోనే తాము చర్యలు తీసుకునేందుకు వెళ్లామని పోలీసులు చెబుతున్నారు. పోలీసును గ్రామస్థులు కొట్టిన ఘటనపై విచారణ జరుగుతోంది.