మిగిలిన ఐపీఎల్ మ్యాచులు యూఏఈలో నిర్వహణ: రాజీవ్ శుక్లా
- కరోనా వేళ వాయిదా పడ్డ ఐపీఎల్-2021 మ్యాచులు
- మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు
- ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ పై మరింత స్పష్టత
భారత్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్-2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. దీనిపై ఈ రోజు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్ ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు.
మిగిలిన మ్యాచులను యూఏఈలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మొదటి పదిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవకాశం ఉంది. అనంతరం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వహించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో దశ ఆటకు వేదిక ఖరారైన నేపథ్యంలో దీనిపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కొన్ని రోజులుగా విదేశీ క్రికెట్ బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. కరోనా వేళ విదేశీ ఆటగాళ్లను ఈ మ్యాచుల్లో ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే, టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు సమయం కోరుతోంది.