ఫిన్లాండ్ ప్ర‌ధాని బ్రేక్ ఫాస్ట్ బిల్‌పై పోలీసుల‌ విచార‌ణ‌!

  • కుటుంబ స‌భ్యుల‌ బ్రేక్ ఫాస్ట్ కోసం క్లెయిమ్ చేసుకుంటోన్న వైనం
  • నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తోన్న స‌నా
  •  ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి డ‌బ్బు తీసుకుంటోన్న ప్ర‌ధాని
  • ఓ వార్తా ప‌త్రిక‌లో క‌థ‌నం ప్ర‌చుర‌ణ‌
ప్ర‌పంచంలో అతి చిన్న వ‌య‌సు(34)లోనే ప్రధాని పదవి చేపట్టి రికార్డు సృష్టించి, అనంత‌రం ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన  ఫిన్లాండ్ ప్ర‌ధాని సనా మారిన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నో నీతులు చెప్పే ఆమె త‌మ కుటుంబ స‌భ్యుల‌ బ్రేక్ ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు (365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ ఆ ధ‌నాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి క్లెయిమ్ చేసుకుంటూ వ‌స్తున్నారట‌.

ఈ విష‌యాన్ని అక్క‌డి ఓ వార్తా ప‌త్రిక‌ ప్రచురించడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆమెపై వ‌స్తోన్న‌ ఆరోపణల నేప‌థ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. స‌నా మారిన్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కెసరంటాలోని అధికారిక నివాసంలో ఉంటున్నారు. మరోపక్క, త‌న కుటుంబానికి అవుతోన్న బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చును క్లెయిమ్ చేసుకుంటున్న‌ట్లు వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను స‌నా మారిన్ ఖండిస్తున్నారు. ప్రధానిగా తాను ఎలాంటి ప్ర‌త్యేక‌ సౌకర్యాలు కోరుకోలేదని ఆమె చెప్పారు.


More Telugu News