12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేయ‌డానికి ఈయూ ఆమోద ముద్ర‌

  • యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ) సలహా కమిటీ సిఫార్సులు
  • అత్య‌వ‌స‌ర‌ వినియోగానికి ఈయూ ఆమోదం
  • వాలంటీర్లపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫ‌లితాలు
ఫైజర్ వ్యాక్సిన్ ను 16 ఏళ్లు నిండిన‌ వారికే వేసేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు యూరోపియ‌న్ యూనియన్ దేశాల్లో అనుమ‌తి ఉంది. అయితే, 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కూడా ఇక‌పై ఆ వ్యాక్సిన్‌ను వేయ‌నున్నారు. యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) సలహా కమిటీ సిఫార్సుల మేరకు వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర‌ వినియోగానికి ఈయూ ఆమోదం తెలిపింది.

12-15 ఏళ్లలోపు రెండు వేల మంది వాలంటీర్లపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఫైజర్ వ్యాక్సిన్ సురక్షితమైందని తేల‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఈయూ దేశాలు మ‌ళ్లీ త‌మ‌త‌మ దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను 12-15 ఏళ్ల వారికి వేయాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. కాగా, ఈయూ తీసుకున్న‌ నిర్ణయాన్ని ఫైజర్‌ స్వాగతించింది.




More Telugu News