ప్రతి స్కీమూ పెద్ద స్కామ్.. ఏపీలో హోల్ సేల్‌గా అవినీతి: దేవినేని ఉమ
- ఇసుకలో రూ.10 వేల కోట్లు..
- ఇళ్ల పట్టాల్లో రూ.16,500 కోట్లు కొట్టేశారు
- వైన్, మైన్, ల్యాండ్, శ్యాండ్ దోపిడి
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ మహానాడులో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
'ఇసుకలో రూ.10 వేల కోట్లు, ఇళ్ల పట్టాల్లో రూ.16,500 కోట్లు కొట్టేశారు. వైన్, మైన్, ల్యాండ్, శ్యాండ్ దోపిడి. ప్రతి స్కీమూ పెద్ద స్కామ్. హోల్ సేల్‌గా అవినీతి. నదుల అనుసంధానం చిదిమేశారు. పోలవరంపై బూటకపు ప్రకటనలు, నిర్వాసితుల ఊసే లేదు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులన్నీ నత్తనడక వాస్తవం కాదా?' అని సీఎం వైఎస్ జగన్‌ను ఆయన ప్రశ్నించారు.