ప్రయాణికులు లేక వెలవెల.. మరో 8 రైళ్ల రద్దు

  • రద్దు అయిన 8 రైళ్లలో ఆరు తెలుగు రాష్ట్రాలకు చెందినవే
  • జూన్ - నుంచి 11 మధ్య తాత్కాలికంగా రద్దు
  • మిగతా రెండులో భువనేశ్వర్-పూణె రైళ్లు
కరోనా నేపథ్యంలో ప్రయాణికులు లేక వెలవెలబోతుండడంతో మరో 8 రైళ్లను రైల్వే రద్దు చేసింది. రద్దు అయిన రైళ్లలో 6 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే ఉన్నాయి. ఇందులో విశాఖపట్టణం-కాచిగూడ (08561) రైలును జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు, కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జూన్ 2 నుంచి 11 వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును జూన్ 1-10, కడప-విశాఖపట్టణం (07487) రైలును జూన్ 2-11 మధ్య, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును ఒకటో తేదీ నుంచి 10 మధ్య, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును జూన్  2-11, పూణె-భువనేశ్వర్ (02881) రైలును జూన్ 3-10 మధ్య, భువనేశ్వర్-పూణె (02882) రైలును జూన్ 1-8 మధ్య రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.


More Telugu News