నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి
- ప్రమాద సమయంలో 160 మందికిపైగా ప్రయాణికులు
- గల్లంతైన 83 మందీ చనిపోయి ఉంటారని అనుమానం
- నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం
నైజీరియాలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 60 మంది జల సమాధి అయ్యారు. మరో 83 మంది గల్లంతయ్యారు. కెబ్బీ రాష్ట్రంలోని వర పట్టణానికి సమీపంలోని నైజర్ నదిలో జరిగిందీ దుర్ఘటన. ప్రమాద సమయంలో పడవలో 160 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యంలో ఓ వస్తువును ఢీకొనడం వల్ల పడవ ముక్కలైందని, దీంతో అందులోని వారు మునిగిపోయారని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. 60 మృతదేహాలను వెలికితీశారు. కొందరిని రక్షించగలిగారు. గల్లంతైన మరో 83 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పడవ శిథిలావస్థకు చేరుకోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.